TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

RRR.. బాగుందా? బానే ఉందా? ఏది రియ‌ల్ టాక్‌?

Published on: Fri Mar 25, 2022 1:09PM

RRR-ర‌చ్చో ర‌చ్చ‌శ్య ర‌చ్చోభ్యః. మామూలుగా లేదు మూవీ. సిల్వ‌ర్ స్క్రీన్‌పై తార‌క్‌ ర‌చ్చ చేస్తే.. రామ్‌చ‌ర‌ణ్ ప‌ర్ఫార్మెన్స్ ర‌చ్చ‌శ్య‌. ఇక రాజ‌మౌళి డైరెక్ష‌న్ ర‌చ్చోభ్యః. మూడు Rలు క‌లిసి.. బాక్సాఫీస్ కుంభ‌స్థ‌లం కొట్టేశాయి. టాలీవుడ్ దెబ్బ‌కు బాలీవుడ్ మ‌రోసారి షేక్ అవ‌డం ఖాయం. ఇప్ప‌టికే హిట్ టాక్ రావ‌డంతో.. RRR అతిత్వ‌ర‌లోనే 1000 Cr క్ల‌బ్‌లో చేర‌నుంది. దాదాపు అన్నిసైట్లు 3.5 రేటింగ్ ఇచ్చేశాయి. అయితే, ప‌బ్లిక్‌లో మాత్రం డిఫ‌రెంట్‌ టాక్ వ‌స్తోంది. 

కొమ‌రంభీం వ‌ర్సెస్ అల్లూరి. ఎవ‌రికి ప్రాధాన్యం ద‌క్కిందనేది పాయింట్‌. జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను త‌గ్గించి చూపించారంటూ ఆయ‌న ఫ్యాన్స్ గోల గోల చేస్తున్నారు. ఫ‌స్ట్ హాఫ్ మొత్తం తార‌క్ చుట్టే క‌థ తిరిగినా.. సెకండ్ హాఫ్‌లో రామ్‌చ‌ర‌ణ్‌కు ఫుల్ హైప్ ఇచ్చార‌ని ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ ర‌చ్చ చేస్తున్నారు. మ‌ల్టీ స్టార‌ర్ అన్న‌ప్పుడు ఇలాంటివ‌న్నీ కామ‌న్‌. వాళ్లు వాళ్లు బాగానే ఉంటారు మ‌ధ్య‌లో ఈ అభిమానుల ఓవ‌రాక్ష‌న్ ఏంటో.

ఇక భీం.. అల్లూరి క్యారెక్ట‌ర్ల ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్స్‌.. గూజ్‌బ‌మ్స్ తెప్పిస్తాయి. వాళ్లిద్ద‌రి హీరోయిజాన్ని ఫుల్‌గా హైలెట్ చేశారు రాజ‌మౌళి. ఇలాంటి సీన్లు తీయ‌డంలో త‌ను జ‌క్క‌న్న‌నే అని మ‌రోసారి ప్రూవ్ చేసుకున్నారు. వారిద్ద‌రి మ‌ధ్య ఎమోష‌న్స్‌కు బాగా పండించారు. భావోద్రేగాల‌తో ఆటాడుకున్నారు. ఇక ఇంట‌ర్వెల్ బ్యాంగ్ ఇంకో లెవెల్‌. రాజ‌మౌళి ఏ సినిమా తీసుకున్నా.. ఇంట‌ర్వెల్ సీన్‌ను ఓ రేంజ్‌లో తీస్తారు. బాహుబ‌లిలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్పూర్తితో.. భ‌ళ్లాలదేవ‌ ప‌ట్టాభిషేకం, ప్ర‌జ‌ల ఎమోష‌న్‌తో థియేట‌ర్ల‌ను షేక్ చేసిన‌ట్టే.. RRRలోనూ ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌కే ఫుల్ టికెట్ పైసా వ‌సూల్ అనిపించారు. 

ఫ‌స్ట్ హాఫ్‌తో 10 నిమిషాల బ్రేక్‌కు వెళ్లొచ్చి.. క్యాంటీన్లో జేబుల‌కు చిల్లు పెట్టుకొచ్చిన ఆడియ‌న్స్‌కు.. సెకండ్ హాఫ్ మీద ఇంకా ఎక్స్‌పెక్టేష‌న్ పెరిగిపోతుంది. కానీ, విచిత్రంగా అక్క‌డి నుంచి సినిమా డ‌ల్ అయిపోతుంది. స్లో....గా సాగుతుంది. చెబితే ఒప్పుకోక‌పోవ‌చ్చు కానీ.. రాజ‌మౌళికి సైతం కొన్ని మైన‌స్‌లు ఉన్నాయి. చ‌త్ర‌ప‌తి సినిమా ఓసారి గుర్తు చేసుకోండి.. అందులో సెకండ్ హాఫ్ చెత్త చెత్త‌. మ‌గ‌ధీర‌లో ఫ‌స్ట్ హాఫ్ సో సో. య‌మ‌దొంగ అయితే ర‌మారాజ‌మౌళికే న‌చ్చ‌లే. ఇలా, రాజ‌మౌళి తీసిన ప‌లు సినిమాల్లో ఓ హాఫ్ కాస్త వీక్ అవుతుంది. ఓవ‌రాల్‌గా సినిమా హిట్ అవుతుండ‌టంతో.. ఆ వీక్‌నెస్ గురించి పెద్ద‌గా చ‌ర్చ జ‌ర‌గ‌దు. హిట్ కొట్టినోడే కింగ్ ఇండ‌స్ట్రీలో. అందుకే రాజ‌మౌళి తిరుగులేని సూప‌ర్‌కింగ్‌. సంగీత మాంత్రికుడు కీర‌వాణి ఆయ‌న‌కు అద‌న‌పు బ‌లం, బ‌ల‌గం.

ఫ‌స్ట్ హాఫ్‌, ఇంట‌ర్వెల్‌, ఎమోష‌న్స్‌, డైలాగ్స్‌, మ్యూజిక్‌, సాంగ్స్‌, విజువ‌ల్స్‌, గ్రాఫిక్స్‌, యాక్టింగ్‌, కెమెరా ప‌నిత‌నం, ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌, క్లైమాక్స్.. ఇలా అన్నీ క‌లిసి RRRను బంప‌ర్ హిట్ చేయ‌డం ఖాయం. రామ్‌చ‌ర‌ణ్‌ను శ్రీరాముడిని చేసి.. ఎన్టీఆర్‌ను హ‌నుమంతుడి స్థాయికే ప‌రిమితం చేయ‌డం మాత్రం జూనియ‌ర్ ఫ్యాన్స్‌కు కాస్త నిరాశే. విడివిడిగా చూస్తే సీన్లు అన్నీ బాగా ఉన్నాయని అనిపించినా.. ఓవరాల్ గా సినిమా మొత్తం చూశాక ఏదో మిస్ అయినట్టు.. ఇంతేనా అన్నట్టు అనిపిస్తుంది. సినిమా బాగుందంటూనే.. అంతా 3.5 రేటింగ్‌కే ప‌రిమితం కావ‌డానికి కార‌ణం సెకండ్ హాఫే కావొచ్చు. ఇక‌, ఈ స‌మ్మ‌ర్ సీజ‌న్‌ మొత్తం.. చ‌ల్ల‌గా ఏసీ థియేట‌ర్ల‌లో కూర్చొని.. RRRను బాగా ఎంజాయ్ చేయొచ్చు. 1000 కోట్ల క్ల‌బ్‌లో త్వ‌ర‌లోనే చేరొచ్చు.