TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రేట్ పెంచేసిన రోజా!.. మంత్రి పదవి రాదనే జబర్దస్త్ ఆఫరా?

Published on: Wed Mar 2, 2022 11:14AM

ఎమ్మెల్యే ఆర్కే రోజా.. వెండి తెర మీద ఓ వెలుగు వెలిగి.. ఆ తర్వాత బుల్లి తెర మీద వాలి.. అటు నుంచి ప్రజా ప్రతినిధిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్‌గా ఉన్నారు. రేపో మాపో జగన్ కేబినెట్‌లో రోజా మంత్రి అయిపోతుందనే టాక్ కూడా ఉంది. ఎమ్మెల్యే అయినా.. మరో కీలక పదవి చేపట్టినా.. బుల్లి తెర మీద జడ్జి కూర్చిని మాత్రం వదలడం లేదు రోజా. ఎమ్మెల్యే అంటే నిత్యం ప్రజల్లో ఉంటారని... క్షణం తీరిక కూడా ఉండదని కూడా అంతా అంటూ ఉంటారు. అలాంటిది జబర్దస్త్ కూర్చిని మాత్రం రోజా ఎందుకు వదలడం లేదంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నలు మీద ప్రశ్నలు వేస్తున్నారు. కానీ ఈ అంశంపై రోజా ఎక్కడా స్పందించింది లేదన్న సంగతి అందరికీ తెలిసిందే.  

ప్రముఖ టీవీ చానల్‌లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో.. అందరినీ తెగ అలరిస్తోంది. అయితే ఈ షో ఇటీవల 9 ఏళ్లు పూర్తి చేసుకోంది. మరో ఏడాది గడిస్తే ఈ షో ప్రారంభమై దశాబ్దం పూర్తి చేసుకోంటోంది. అయితే ఈ షో లో వచ్చే కమెడియన్లకు మంచి పేరు ప్రఖ్యాతలే వచ్చాయి. ఈ సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఈ షోకు జడ్జిగా ఉంటున్న ఆర్కే రోజా.. ఒక్కొ ఎపిసోడ్‌కు పారితోషికం కింద 9 లక్షలు తీసుకోంటున్నట్లు తాజాగా టాక్ అయితే ఫిలింనగర్ వర్గాల్లో చక్కెర్లు కొడుతోంది.

వచ్చే ఏడాది ఈ షో ప్రారంభమై 10 ఏళ్లు పూర్తి చేసుకోంటోంది. ఈ నేపథ్యంలో రోజా పారితోషకం 10 లక్షలు తీసుకుంటారని సమాచారం. అయితే ఈ షో ప్రారంభంలో జడ్జిగా ఆమెకు ఒక్కో ఎపిసోడ్‌కు 2 లక్షలు ఇచ్చేవారని.. ఆ తర్వాత క్రమంగా పెరిగిన ఆమె పారితోషకం.. ఇటీవల వరకు ఒక్కో ఎపిసోడ్‌కు 8 లక్షల వరకు ముట్ట జెప్పేవారని తెలుస్తోంది.

ఈ షోలో పాల్గొనే మరో జడ్జి, గాయకుడు మనోకు కూడా భారీగానే పారితోషకం అందిస్తున్నట్లు మల్లెమాల వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ప్రతి ఏడాది ఈ షోకు రోజా కొత్తగా ఒప్పందం చేసుకోంటుందని తెలుస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో ఆమెకు పారితోషికం ఇవ్వడం వల్ల రోజా ఎమ్మెల్యే అయినా ఈ  షో వదలదంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అలాగే భవిష్యత్‌లో ఆర్కే రోజా మంత్రి అయినా కూడా ఈ షో ను మాత్రం ఆమె కొనసాగిస్తోంది.. కానీ ఆమె ఈ షోను వదిలి పెట్టే ప్రసక్తే లేదని నెటిజన్లు తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు.