TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

షుగర్ లెవల్స్ పడిపోయిన రోజా.. జగన్ పరామర్శ

Published on: Sat Dec 19, 2015 11:36AM

వైసీపీ ఎమ్మెల్యే రోజాను పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి స్టేషన్ కు తరలించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఆవరణలోకి వస్తున్న రోజాను మార్షల్స్ అడ్డుకోవడం.. దీంతో రోజా కిందకు పడి స్వల్ప గాయలవడం.. షుగర్ లెవల్స్ పడిపోవడంతో ఆమెను పోలీస్ స్టేషన్ నుండి ఆస్పత్రికి తరలించారు. మరోవైపు జగన్.. రోజా అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు. ఒక మహిళా ఎమ్మెల్యేను స్పృహతప్పి పడేలా మార్షల్స్ కొట్టటం ఏమిటంటూ నిలదీశారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే నియంతృత్వమా అన్న సందేహం కలుగుతుందని జగన్ వాపోయారు. కాగా జగన్.. ఎమ్మెల్యే రోజాను పరామర్శించారు.