రేసులో రోజా, రజని.. ఎవరికి జగనన్న ఛాన్స్?
Published on: Wed Mar 9, 2022 11:48AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి త్వరలోనే తమ మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తారానే ప్రచారం మరోసారి ఊపందుకుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే, ముఖ్యమంత్రి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పై దృష్టి పెడతారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఊగాదికి కొత్త జిల్లాలతోపాటుగా, కొత్త మంత్రి వర్గం కొలువు తీరడం ఖాయమని,అంటున్నారు. నిజానికి, ముఖ్యమంత్రి రెండున్నర సంవత్సరాలు పూర్తయిన వెంటనే, పాత ముఖాలను పూర్తిగా పక్కన పెట్టి, కొత్తవారికి అవకాశం కల్పిస్తామని చెప్పారు, అయితే, తొలి రెండున్నర సంవత్సరాలలో ఎక్కువ కాలం, ‘కొవిడ్’ మింగేయడంతో మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణను మరో ఆరు నెలలు వాయిదా వేశారు. ఇప్పుడు ఆ గడవు కూడా ముగియడంతో ముఖ్యమంత్రి ముహూర్తం ఖరారు చేశారని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ముందు చెప్పినట్లుగా మంత్రివర్గాన్ని పూర్తిగా మార్చేసి ఆలోచన అయితే, ఇప్పుడు లేదని అంటున్నారు. ముందస్తు ఎన్నికల ఆలోచన కూడా ఉన్న నేపధ్యంలో మేకపాటి మరణంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడంతో పాటుగా స్వల్పమార్పులు చేర్పులతో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పూర్తిచేస్తారని అంటున్నారు.
అదలా ఉంటే, ఇప్పటికే నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, ఈసారి ఎలాగైనా మంత్రి పదవి దక్కించుకోవాలని చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క ఛాన్స్ ప్లేజ్’ అంటూ ఆమె ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు అ అంతటా కనిపిస్తూనే ఉన్నాయి. సరే, రోజాకు మంత్రి పదవి వస్తుందా రాదా అనే విషయాన్ని పక్కన పెడితే, ఆదే స్థాయిలో మరో మహిళా ఎమ్మెల్యే, చిలుకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ కూడా మంత్రి పదవి కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.
నిజానికి గతంలో రాజ్య సభకు ఎన్నికైన పిల్లి సుభాష్, మోపిదేవి వెంకట రమణల రాజీనామాతో ఖాళీ అయిన స్థానల్లో గుంటూరు నుంచి విడదల రజనీకి చాన్స్ వస్తుందని గట్టి ప్రచారం జరిగింది. అయితే ఆమె తొలి సారి ఎమ్మెల్యే కావడంతో అవకాశం ఇవ్వలేదని వైసీపీ వర్గాలు చెప్పుకున్నాయి. అయితే అదే తొలి సారి ఎమ్మెల్యే అయిన అప్పల్రాజుకు అవకాశం కల్పించారు. ఇప్పుడు మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ తరుణంలో మరోసారి విడదల రజనీ పేరు పరిశీలనలోకి వచ్చినట్లుగా తెలుస్తోంది.స్వతహాగా పార్టీ కార్యక్రమాలలో చాలా చురుగ్గా వ్యవహరించే రజనీకి స్థానిక ఎంపీ కృష్ణదేవరాయులుతో విబేధాలు ఉన్నాయి. అది బహిరంగ్ రహస్యం. అయినా పార్టీ హైకమాండ్ ఆమెకే మద్దతు పలుకుతూవస్తోంది . ఈ క్రమంలో గుంటూరు జిల్లా నుంచి బీసీ కోటాలో రజనీకి మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం జరుగుతోంది.
అయితే, రోజాకు మంత్రి పెద్ది రెడ్డి అడ్డుపడుతున్న విధంగా, రజనీకి, ఎంపీ వర్గం అడుగుడుగున అవరోధాలు సృష్టిస్తోందని సమాచారం. ఈనేపధ్యంలో మంత్రిపదవి ఇద్దరిలో ఎవరికీ దక్కుతుంది అనే విషయంలో ఇటు రాష్ట్ర రాజకీయాలలో అటు గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఆశక్తికర చర్చ జరుగుతోంది.


