TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అప్పట్లో రాముడు… తరువాత వైఎస్ఆర్… నెక్ట్స్ జగన్!

Published on: Wed Apr 5, 2017 4:39PM

 

రాజకీయాల్లో కొందరు నేతలు మెదడుతో నెగ్గుకొస్తే మరి కొందరు నోటితో నెగ్గుకొస్తారు. ఈ రెండో కోవకే చెందుతారు ఫ్రైర్ బ్రాండ్ పొలిటీషన్ రోజా! ఆమె ఎక్కడ ఏ చిన్న స్టేట్మెంట్ చేసినా గరం గరంగానే వుంటుంది కంటెంట్! శ్రీరామ నవమి సందర్భరంగా కూడా ఆమె తన పార్టీ విధేయత చాటుకున్నారు. అయితే, తనదైన స్టైల్లో రామ నవవి స్పెషల్ గా శ్రీరాముల వార్ని చర్చలోకి లాగారు!

 

రోజా ముందుకు మీడియా వారి మైకులు రావటం అంటే… పెట్రోల్ బావిలో అగ్గి రాజుకోవటమే! ఆమె గతంలో టీడీపీలో వున్నప్పుడు కాంగ్రెస్ ని కడిగి పారేసినా అదే రేంజ్లో వుండేది. ఇప్పుడు వైసీపీలో వుండి టీడీపీని టార్గెట్ చేసినా అలాగే వుంటుంది. ఇక రామ నవమి సందర్భంగా ఆమె ఒంటిమిట్ట చేరుకుని అక్కడ కూడా తనదైన స్టైల్లో జబర్ధస్త్ కామెంట్ ఒకటి చేశారు! ఏకంగా రాముడ్నే ప్రస్తావిస్తూ… ఆయన తరువాత అలాంటి పాలన వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జనం చవి చూశారని అన్నారు! ఇది కాస్త ఎక్కువే అయినా వైఎస్ఆర్సీపీ నేతగా ఆమె మాటని అర్థం చేసుకోవచ్చు. కాని, ఇంకాస్త భవిష్యత్ దర్శనం కూడా చేయించారు రోజమ్మ! ముందు ముందు జగన్ పాలన వచ్చిన వెంటనే మరోసారి రామ రాజ్యం వచ్చస్తుందని భరోసా ఇచ్చారు!

 

రాజన్న రాజ్యం, చంద్రన్న రాజ్యం, రేపో మాపో జగనన్న రాజ్యం … ఇలా రకరకాల రాజ్యాలు ఆయా పార్టీల వారు గొప్పగా చెప్పుకుంటూ వుంటారు. కాని, రోజా రాముడంతటి దేవుడ్ని కూడా తమ అభిమాన నాయకులు వైఎస్ఆర్, జగన్ ల సరసన నిలపటం కొంచెం ఇబ్బంది కలిగించే విషయం! అదీ ఒంటిమిట్ట రామనవమి ఉత్సవాలకి హాజరై ఇలా పొలిటికల్ స్టేట్మెంట్లు ఇవ్వటం మరింత అవాంఛనీయం. గతంలో కూడా రోజా తిరుమల శ్రీవార్ని దర్శించుకున్న వెంటనే…. కొండ మీదనే, ఆలయం ముందు నిల్చునే పొలిటికల్ కామెంట్స్ చేశారు!