జగన్ మాటలు రోజాకే నచ్చాలి...!


నంద్యాల ఉపఎన్నిక ప్రచారంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై పలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి ఎన్నికల ప్రచారంలో... చంద్రబాబును కాల్చి చంపాలని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగింది. ఇక టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయడంతో..ఆవేదన తట్టుకోలేక అలా మాట్లాడానని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇక నిన్న జరిగిన ప్రచారం కార్యక్రమంలో అయినా తన నోరు అదుపులో పెట్టుకున్నారా అంటే అది కూడా లేదు. నిన్న జరిగిన సభలో మాట్లాడుతూ.. చంద్రబాబును ఉరితీయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ నేతలు ఆయనపై ఎదురుదాడికి దిగారు. ఇక అందరి సంగతి ఎలా ఉన్నా... వైసీపీ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజా మాత్రం జగన్ మాటలను వెనుకేసుకొచ్చింది. చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని...ఎన్నికల హామీలను విస్మరించి.. అన్ని వర్గాలను మోసం చేసిన చంద్రబాబుకు ఎలాంటి శిక్ష వేయాలో టీడీపీ నేతలే చెప్పాలని ఆమె అన్నారు. ఓటమి భయంతో టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుందని....మొత్తానికి జగన్ వ్యాఖ్యలను రోజా సమర్ధించడం చూస్తుంటే.. పిల్లికి ఎలుక సాక్ష్యం అన్న సామెత గుర్తొస్తుంది కదా..