TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రో-కో తగ్గేదేలే.. విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల వరద

Published on: Thu Dec 25, 2025 12:13PM

స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఇప్పటికే టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికారు.  వీరిద్దరూ కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్నారు. వీరిద్దరూ ఆడితే చూడాలని అభిమానులు తపిస్తున్న నేపథ్యంలో వచ్చింది.. విజయ్ హజారే ట్రోఫీ. సఫారీలతో రెండు సెంచరీలతో అదరగొట్టిన విరాట్ కోహ్లీ ఢిల్లీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తుండగా.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ముంబై తరఫున ఆడుతున్నారు. ఈ టోర్నీలోనూ రో-కో పరుగుల వరద పారిస్తున్నారు.  

జైపుర్ వేదికగా సిక్కింతో బుధవారం (డిసెంబర్ 24) జరిగిన మ్యాచ్లో ముంబై దూకుడు ప్రదర్శింది. తొలుత బ్యాటింగ్ చేసిన సిక్కిం నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 237 పరుగులు చేసింది. అనంతరం 237 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి  దిగిన ముంబై 30.3 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసి ఆటను ముగించింది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ 94 బంతులు ఎదుర్కొని 18 ఫోర్లు, 9 సిక్సులతో 155 పరుగులు చేశాడు. దీంతో రోహిత్ ఫ్యాన్స్ అంతా ముంబై ఛా రాజా అంటూ నినాదాలు చేస్తున్నారు. కాగా హిట్‌మ్యాన్  ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

ఇక ఆంధ్రతో జరిగిన మ్యాచ్ లో   ఢిల్లీ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో వన్ డౌన్‌లో బరిలోకి దిగిన స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 85 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 3 సిక్సులతో 107 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తొలుత బ్యాటింగ్‌కి ఆంధ్ర జట్టు 8 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకి దిగిన ఢిల్లీ 27.4 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. ఆ స్టేజ్‌‌లో కోహ్లీతో కలిసి ప్రియాంక్ ఆర్య(74) రాణించడతో ఢిల్లీ 37.4 ఓవర్లో లక్ష్యాన్ని సునాయాసంగా అందుకుని విజయ సాధించింది