TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాబిన్ విలియమ్స్... బెల్ట్‌తో ఉరి...

Published on: Wed Aug 13, 2014 1:56PM

 

ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబిన్ విలియమ్స్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. రాబిన్ విలియమ్స్ మరణం గురించి మొదట్లో రకరకాల కథనాలు వచ్చాయి. రాబిన్ విలియమ్స్ ముఖానికి ప్లాస్టిక్ కవర్ కట్టుకోవడం వల్ల ఊపిరి ఆడక మరణించారని మొదట్లో కథనాలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన మరణం అనుమానాస్పదంగా వుందన్న వదంతులూ వినిపించాయి. తాజాగా మారిన్ కౌంటీ పోలీసులు రాబిన్ విలియమ్స్ మరణం మీద క్లారిటీ ఇచ్చారు. రాబిన్ విలియమ్స్ నిరాశ, నిస్పృహల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. అది కూడా తన బెల్టుతో ఉరి వేసుకుని మరణించారు. ఆత్మహత్యకు ముందు రాబిన్ ఏవైనా విష పదార్ధాలు తీసుకున్నారా లేదా అనేది పోస్టుమార్టం నివేదిక బయటకి వచ్చాక వెల్లడి అవుతుంది. రాబిన్ మరణం పట్ల అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సంతాపం ప్రకటించారు. గొప్ప నటుడిని, స్నేహితుడిని కోల్పోయానని పేర్కొన్నారు.