షిర్డీ-విశాఖ రైల్లో భారీ దోపిడీ
Published on: Sat Aug 2, 2014 10:59AM

ఇటీవలి కాలంలో రైళ్ళను దోచుకునే బందిపోటు దొంగలు ఎక్కువైపోయారు. ప్రతి వారమూ దేశంలో ఏదో ఒక మూల రైళ్ళ మీద దోపిడి దొంగలు దాడి చేసి దోచుకుంటూనే వున్నారు. అలాంటి దోపిడీ సాయినగర్ షిర్డీ - విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. షిర్డీ నుంచి వస్తున్న ట్రైయిన్ మహారాష్ట్రలోని పర్చూరు దగ్గరకు రాగానే దొంగలు చైన్ లాగి ట్రెయిన్ ఆపేశారు. ఎస్-1, ఎస్-2, ఎస్-3, ఎస్-5 బోగీల్లో వున్న ప్రయాణికులను ఆయుధాలతో బెదిరించి దోచుకున్నారు. రైలు పూర్ణ స్టేషన్ దగ్గరకి వచ్చిన తర్వాత ప్రయాణికులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైలులో భద్రతా సిబ్బంది లేకపోవడం పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


