ఇక హైదరాబాద్‌లో రోడ్లు తవ్వితే..కటకటాల పాలే..!

పేరుకు ప్రపంచస్థాయి నగరమైనా హైదరాబాద్‌లో కనీస మౌలిక వసతులు లేవు. రోడ్ల గురించైతే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. భాగ్యనగరంలో రోడ్ల దుస్థితికి కారణం కొందరు కాంట్రాక్టర్ల చేతివాటం కాగా..మిగిలిన కారణం ప్రజలే. కేబుల్స్ కోసమో, మరేదైనా కారణం వల్లనో భాగ్యనగర వాసులు తమ ఇళ్ల దగ్గర రోడ్లను తెగ తవ్వేస్తున్నారు. ఇకపై ఇలాంటి ఆటలు సాగవని తెలిపింది జీహెచ్ఎంసీ. ఇక నుంచి ఎవరైనా సరే పొరపాటుగానో లేదా ఉద్దేశపూర్వకంగానో రోడ్లను తవ్వితే..తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి. రోడ్లను తవ్విన వారిపై కేసులు పెడతామని..రోడ్లను తవ్వడానికి కూడా అనుమతి ఇవ్వబోమని  చెప్పారు. ఈ ఉత్తర్వులు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయన్నారు.