TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రోడ్డు ప్రమాదంలో రెండు కుటుంబాలు మాయం

Published on: Mon Jun 9, 2014 5:02PM

 

 

 

రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాలను కబళించింది. వరంగల్ జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. వరంగల్ జిల్లా కాశీబుగ్గకి చెందిన రెండు కుటుంబాలలోని మొత్తం 12 మంది కరీంనగర్ జిల్లా వేములవాడ రాజన్న దేవాలయానికి బయల్దేరారు. ఈ పన్నెండు మందీ ఒక ఆటోలో వేములవాడకు వెళ్తూ వుండగా, ఆరేపల్లి అనే గ్రామం దగ్గర ఎదురుగా వస్తున్న లారీ వీరి ఆటోని ఢీకొంది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న రెండు కుటుంబాలకు చెందిన 12 మంది అక్కడికక్కడే మరణించారు. మరణించిన వారిలో ఐదుగురు మహిళలు, ఇద్దరు పిల్లలు కూడా వున్నారు.