తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం
Published on: Mon May 18, 2026 11:01AM
.webp)
తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మధురై అన్నా నగర్ ప్రాంతానికి చెందిన ప్రకాష్, అతని బంధువులు కలిసి ఒక వాహనంలో తిరుచిరాపల్లిలోని ప్రసిద్ధ సమయపురం మరియమ్మన్ ఆలయ దర్శనానికి వెళ్లారు.
ఆదివారం సాయంత్రం సమయంలో అమ్మవారిని సేవించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. తిరుగు ప్రయాణంలో వీరి వాహనం మేలూరు సమీపంలోని అయ్యపట్టి ప్రాంతంలో జాతీయ రహదారిపై అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొంది. ఈ ప్రమాద తీవ్రతకు కారు ముందుభాగం నుజ్జు నుజ్యైంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురూ అక్కడికక్కడే మరణించారు. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్ల గానీ, అతివేగం వల్ల గానీ ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.


