TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మిలిటరీ ట్రక్కు లోయలో పడి 16 మంది దుర్మరణం

Published on: Fri Dec 23, 2022 3:47PM

ఉత్తర సిక్కింలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 16 మంది సైనికులు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన బెంగాల్ లోని ఆసుపత్రికి ఎయిర్ లిఫ్ట్ చేశారు. చైనా సరిహద్దులోని జెమా ప్రాంతం వద్ద ఈ దుర్ఘటన జరిగింది.

సైనికులు ప్రయాణిస్తున్నవాహనం లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. దుర్ఘటన జరిగిన సమయంలో వాహనంలో 20 మంది ఉన్నారు.  సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు.

రోడ్డు ప్రమాదంలో 16 మంది సైనికులు దుర్మరణం చెందడంపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు.