TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

నిన్న పెనుగంచిప్రోలు..నేడు రాజస్థాన్

Published on: Fri Mar 3, 2017 2:58PM

కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు వద్ద దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై 11 మంది దుర్మరణం పాలైన సంఘటన మరచిపోకముందే రాజస్థాన్‌లో మరో ఘోర ప్రమాదం సంభవించింది. హనుమాన్‌గఢ్ సమీపంలోని జాతీయ రహదారిపై జీపు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో జీపు నుజ్జునుజ్జు అవ్వగా..17 మంది దుర్మరణం పాలయ్యారు. స్థానికులు ప్రమాదస్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.