ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
Published on: Sat Oct 17, 2015 11:08AM

ఏపీలోని ప్రకాశం జిల్లా కందుకూరు మండలం చెర్లోపాళెం శివారులో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా పుట్లూరు మండటం చేవూరు నుంచి డీసీఎంలో మాలకొండ వెళుతున్న పెళ్లి బృందాన్ని ఎదురుగా వస్తున్న శ్రీకృష్ణా ట్రావెల్స్ కు చెందిన ప్రైవైటు బస్సు ఢీ కొంది. దీంతో డీసీఎం బస్సు క్యాబిన్ లోకి దూసుకెళ్లి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డీసీఎంలో ఉన్న 40 మందిలో 15 మంది మృతి చెందగా మరో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే బస్సులో మాత్రం ఎవరూ లేకపోవడం.. డ్రైవర్ అతి వేగంగా రావడంతో ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించగా.. చనిపోయిన వారిని కందుకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని సమాచారం.


