TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పెరూలో ఘోర రోడ్డు ప్రమాదం.. 26 మంది దుర్మరణం

Published on: Wed Jul 17, 2024 9:40AM

దక్షిణ అమెరికాలోని పెరూలో  జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 26 మంది దుర్మరణం పాలయ్యారు. పెరూ రాజధాని లిమా నుంచి 40 మందికి పైగా ప్రయాణికుల తో వెళ్తున్న బస్సు అదుపుతప్పి 200 మీటర్ల లోతులో ఉన్న లోయలో పడిపోయింది.    

ఈ దుర్ఘటనలో 26మంది మరణించారు. మరో 14 మంది తీవ్రంగా గాయ పడ్డారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో  మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.  అక్కడి   కాలమాన ప్రకారం బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.

 సమాచారం అందిన వెంటనే   అధికారులు ఘటనాస్థలా నికి చేరుకున్ని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ  వారిని ఆస్పత్రికి తరలించారు.  ఘాట్ రోడ్డుపై అతివేగంగా వెళ్లడమే ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.