మధురలో రోడ్డు ప్రమాదం... 11 మంది మృతి
Published on: Tue Sep 23, 2014 9:16AM
.jpg)
ఉత్తరప్రదేశ్లోని మధురలో మంగళవారం తెల్లవారుఝామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతిచెందారు. దాదాపు 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. రెండు వాహనాలు ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స జరిపిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.


