TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Published on: Fri Jun 26, 2026 1:06PM

పల్నాడు జిల్లాలో శుక్రవారం (జూన్ 26) తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు.  మాచర్ల  నగరవనం సమీపంలో రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన వాహనం బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద తీవ్రతకు తీవ్రతకు వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఆ వాహనంలో ఉన్న వారిలో నలుగురు  అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

 సమాచారం అందుకున్న వెంటనే  పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది,   సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను  మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  ప్రాథమిక సమాచారం ప్రకారం, మృతులంతా హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తిం చారు.  బంధువు మరణించడంతో అంత్యక్రియలకు హాజరయ్యేందుకు పామూరు వైపు వెళ్తుండగా ఈ   ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మాచర్ల పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.