కరీంనగర్ లో రోడ్డు ప్రమాదం... ఇద్దరి మృతి
Published on: Sat Dec 16, 2023 9:35AM
కరీంనగర్‌లో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం పెద్దంపల్లికి చెందిన ఆకాశ్ (22), ఏంపేడుకు చెందిన శ్రావణ్ (32)గా గుర్తించారు. గాయపడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. అతడిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. హుజురాబాద్ వైపు నుంచి కరీంనగర్ వైపు వెళుతున్న ఓ కారు తాడికల్ శివారులోని జాతీయ రహదారి పైన, బతుకమ్మ ఘాట్ మూల వద్ద కరీంనగర్ వైపు నుండి హుజురాబాద్ వైపు వెళుతున్న లారీని కారు అతివేగంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు కారులోనే మృతిచెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.


