రోడ్డు ప్రమాదం: తిరుమల యాత్రికుల దుర్మరణం

Publish Date:Aug 5, 2014

 

కాలినడకన తిరుమలకు వెళ్తున్న భక్తుల మీదకు లారీ దూసుకు వెళ్ళడంతో నలుగురు భక్తులు మరణించారు. ఈ ఘోర దుర్ఘటన చిత్తూరు జిల్లా నారాయణవనం మండలం పాలమంగళం దగ్గర మంగళవారం ఉదయం జరిగింది. ఈ భక్తులు తమిళనాడు రాజధాని చెన్నై నుంచి తిరుమలకు కాలినడకన వెళ్తున్నారు. లారీ డ్రైవర్ నిద్రమత్తులో వాహనాన్ని నడపటం కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు.

By
en-us Political News