ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి!
Published on: Tue Oct 1, 2024 1:14PM

ఆదిలాబాద్ జిల్లాలో నిన్న అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. గుడిహత్నుర్ మండలం మేకలగండి జాతీయ రహదారిపై వస్తున్న కారు అదుపు తప్పి సైడ్ పిల్లర్ల ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు పిల్లలతో సహా అయిదు గురు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఈ ప్రమాదంలో మరణించిన వారిని ఆదిలాబాద్ కు చెందిన మొజుద్దీన్ (60), మొయినొద్దీన్ (40), అలీ (8), ఉస్మానొద్దీన్ (10), ఉస్మాన్ (12)గా గుర్తించారు. భైంసాలో ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.


