రోడ్డు ప్రమాదంలో 31మంది మృతి
Published on: Wed Aug 8, 2012 10:28PM
షిల్లాంగ్:గౌహతి నుంచి అగర్తల వెళుతున్న బస్సు తూర్పు జైనిటా హిల్స్ జిల్లాలో లోయలో పడటంతో 31 మంది మరణించారు. 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. మేఘాలయ,అస్సాం సరిహద్దులోని తామ్సెంగ్ గ్రామం వద్ద ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య 44వ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. 80 అడుగుల లోతైన గోతిలో పడటంతో ప్రాణనష్టం భారీగా సంభవించింది. ఇప్పటివరకూ 31 మృత దేహాలను వెలికి తీశామని పోలీసులు తెలిపారు. చనిపోయిన వారిలో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. బస్సులో చిక్కుపోయిన వారిని రక్షించేందుకు సహాయ చర్యలు ప్రారంభించారు.ప్రమాదంలో బస్సు డ్రై వర్ కూడా మరణించాడు. డ్రై వర్ మద్యం తాగి బస్సు నడపటం లేదా మట్టి కుంగిపోయి కొండచరియలు విరిగిపోవటం ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.


