వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా.. రాష్ట్రపతి ప్రసంగాన్ని అడ్డుకున్న ఏకైక ఎంపీ..
Published on: Fri Jan 29, 2021 5:49PM
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈరాజు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రసంగిస్తుండగా రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు హనుమాన్ బెనివాల్ గట్టిగ నినాదాలు చేశారు. గతంలో బీజేపీకి మిత్రపక్షంగా వ్యవహరించి.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ లోక్ సభ సభ్యుడు ఈ హనుమాన్ బెనివాల్.. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉపసంహరించుకోవాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘‘మూడు నల్ల చట్టాలు వెంటనే ఉపసంహరించుకోవాలి’’ అని ఇంగ్లీషులో రాసిన ఫ్లకార్డులు చూపిస్తూ అయన పదే పదే నినాదాలు చేశారు. అయితే నినాదాలు చేస్తూ రాష్ట్రపతి ప్రసంగానికి అడ్డుపడుతున్న సదరు ఎంపీని పార్లమెంట్ మార్షల్స్ సభ నుంచి బయటకు తీసుకెళ్లారు.
ఇది ఇలా ఉండగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని 18 ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించిన సంగతి తెల్సిందే. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆయా పార్టీలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించాయి. అయితే సభకు హాజరైన పార్టీల్లో కూడా ఎంపీ.. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకంగా నిరసన గళం వినిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. రాష్ట్రపతి ప్రసంగం పూర్తైన తరువాత హనుమాన్ బెనివాల్ సభలో ఆందోళనకు దిగిన ఫోటోలు తాజాగా సోదాలు మీడియాలో వైరల్ అవుతున్నాయి.


