TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆమె పొద్దు తిరుగుడు పువ్వు!

Published on: Fri Aug 19, 2016 3:32PM

పాస్ట్‌ లైఫ్‌లో హీరోయిన్‌గా..ప్రజంట్ తెలుగు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా ఆమెకు ఇమేజ్ ఉంది...తన అగ్రెసివ్‌నెస్‌తో, వాగ్ధాటితో ఇంటా బయటా జనం దృష్టిని తనవైపు తిప్పుకోవడం ఆమెకు కొట్టినపిండి. రెండుసార్లు ఓడిపోయిన ఈ ఫైర్ బ్రాండ్ ఒక నియోజకవర్గానికి శాసనసభ్యురాలు, అయితే ఆమె ఇప్పుడున్న పార్టీ ప్రతిపక్షంలో ఉండటంతో ఎంతకాలం ఇలాగే ఉంటామని.. ఎక్కడ్నుంచి వచ్చిందో అక్కడికే దుకాణం సద్దేందుకు డిసైడ్ అయినట్లు ఆ నోటా ఈ నోటా వార్తలు వస్తున్నాయి. 


    
మామూలుగా నిప్పులేనిదే పొగ రాదు కదా!? ఈమె విషయంలో కూడా అదే జరిగింది. ఇలాంటి వార్తల్లో పక్కా సమాచారం ఏం వుండదు. కాని, అసలు ఇప్పుడున్న పార్టీ నుంచి ఆవిడ జంప్ అనే విషయం ప్రచారం కావటమే ఏదో జరిగిందనే దానికి గుర్తు! ఎందుకంటే, పొద్దున్న లేస్తే ఆ పార్టీ అధినేతతో సహా, ఎవ్వర్నీ వదిలిపెట్టక ఏకి పారేసే ఆమె అదే పార్టీలోకి తిరిగి వెళ్లబోతోందని ఊరికే ఎవరు ప్రచారం చేస్తారు? నిప్పేదో వుంటేనే కదా పొగ బయలుదేరేది!

 

    తనపై పార్టీ ఫిరాయింపు ప్రచారం మరీ ఎక్కువైపోవటంతో సదరు నాయకురాలు క్లారిఫికిషన్ ఇచ్చుకుంది. తనకు ఆ పార్టీలోకి వెళ్లే ఆలోచనే లేదనీ.. హాయిగా ప్రతిపక్షంలోనే గడిపేస్తానని ఆమె అన్నారు. కాకపోతే, ఆమె వెళ్లాలనుకుంటోన్న పార్టీ నాయకులు చెబుతున్న దాని ప్రకారం, ఆవిడ అతి చేష్టలకు ఒళ్లుమండి వాళ్ల పార్టీ అధినేత ఇప్పుడు ఆమె వస్తాననగానే ఆహ్వానించే సీన్ లేదట. పైగా అమ్మగారు ఏ పార్టీలో అడుగుపెడితే ఆ పార్టీ అధికారం కోల్పోవటం ఖాయమనే నెగటివ్ టాక్ కూడా వుండనే వుంది. కాబట్టి సదరు పార్టీ డోర్స్ ఆవిడగారికి ప్రస్తుతానికి మూసుకున్నట్టే!


    
ఒక్క ఈమె విషయమే కాదు ఇప్పుడు చాలా మంది పొలిటీషన్స్ పొద్దు తిరుగుడు పూల మాదిరిగా తయారయ్యారు. ఆర్దిక ఇబ్బందులో, బయటకు చెప్పుకోలేని ఇతర అనివార్య కారణాలో తెలియదుగాని అధికారంలో వున్న సీఎం వైపు పొద్దు తిరుగుడు పూలలా టర్న్ అయిపోతున్నారు. తెలంగాణలో కేసీఆర్ వల్లే బంగారు తెలంగాణ సాధ్యం అనటం పార్టీల్లోంచి జంప్ చేయటం... ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు గొప్ప నాయకుడనటం పచ్చ కండువా కప్పుకోవటం రొటీన్ అయిపోయింది.