పోటీలో దీపా జయకుమార్, దినకరన్..
Published on: Wed Mar 15, 2017 12:35PM

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆర్కే నగర్ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్థానానికి గాను త్వరలో ఉపఎన్నిక జరగనుంది. ఇక ఈస్థానం నుండి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంకా ఆ నియోజక వర్గంలో అన్నాడీఎంకే నుంచి ఎవరు నిలబడతారన్న ఉత్కంఠ నేటితో తొలగిపోయింది. అన్నాడీఎంకే తరఫున పోటీ చేయనున్న అభ్యర్థి పేరును ఆ పార్టీ ప్రకటించింది. శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌ను ఎన్నికల పోటీకి దింపుతున్నట్లు పేర్కొంది. కాగా వచ్చేనెల 12న ఆర్కేనగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న సంగతి విదితమే.


