TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నన్ను చంపడానికి బీజేపీ, ఆరెస్సెస్‌లు కుట్ర పన్నుతున్నాయి.!!

Published on: Thu Aug 23, 2018 5:23PM

 

నన్ను చంపడానికి బీజేపీ, ఆరెస్సెస్‌లు కుట్ర పన్నుతున్నాయంటూ ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బక్రీద్ సందర్భంగా తన నియోజకవర్గ ప్రజలను కలుసుకునేందుకు ఆయన మహువా వెళ్లారు.. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు తేజ్ ప్రతాప్‌కి శుభాకాంక్షలు చెప్పేందుకు గుమిగూడారు.. అంతలోనే ఆయుధం ధరించిన ఓ వ్యక్తి తేజ్ ప్రతాప్ చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు.. దీనిని గమనించిన తేజ్ ప్రతాప్ డ్రైవర్ అక్కడున్న వారిని అప్రమత్తం చేయడంతో, ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.. అయితే ఈ ఘటనపై స్పందించిన తేజ్ ప్రతాప్ సంచలన వ్యాఖ్యలు చేసారు.. ‘నేను మహువా వెళ్తుండగా మార్గమధ్యంలో ఓ వ్యక్తి నా చేతిని గట్టిగా పట్టుకున్నాడు.. వదలమన్నా వదల్లేదు.. నన్ను చంపేందుకు బీజేపీ, ఆరెస్సెస్‌లు పన్నిన కుట్ర ఇది’ అని ఆరోపించారు.. ఎమ్మెల్యేలకు, మంత్రులకే భద్రత లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏమిటంటూ తేజ్ ప్రతాప్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు.