TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలుగు రాష్ట్రాల నదీ జలాల వివాదాలు...కేంద్రం కీలక నిర్ణయం

Published on: Fri Jan 2, 2026 3:56PM

 

తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదల పరిష్కారానికి కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర జల సంఘం ఛైర్మన్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది.  కమిటీలో సభ్యులుగా కృష్ణా-గోదావరి బోర్డుల ఛైర్మన్లు, ఎన్‌డబ్ల్యూడీఏ చీఫ్ ఇంజనీర్, సీడబ్ల్యూసీ చీఫ్ ఇంజనీర్ రెండు రాష్ట్రాల జల వనరుల శాఖ ఉన్నతాధికారులకు స్థానం కల్పించారు. కమిటీలో ఏపీ నుంచి నలుగురికి, తెలంగాణ నుంచి నలుగురికి చోటు కల్పించారు. నదీ జాల వివాదాల పరిష్కరానికి కమీటీని జల్‌శక్తి శాఖ నోటీపై చేసింది. 

కాగా, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ అధ్యక్షతన గత జూలై 16న ఢిల్లీలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌ రెడ్డిలతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు కమిటీ ఏర్పాటు చేసి సంప్రదింపుల ద్వారా జల వివాదాలను పరిష్కరించుకోవాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కమిటీలో కేంద్ర జలశక్తి శాఖతో పాటు తెలుగు రాష్ట్రాల అధికారులు, సాంకేతిక నిపుణులను నియమించాలని అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. ఏపీ, తెలంగాణ మధ్య ఇటీవల తీవ్ర వివాదస్పదమైన పోలవరం-బనకచర్ల/నల్లమల్ల సాగర్‌ ప్రాజెక్టుతో పాటు ఇతర వివాదాల పరిష్కారానికి ఈ కమిటీ కృషి చేయనుంది.