TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గుడివాడ‌లో గోవా.. కొడాలి నానికి ఆర్జీవీ బిస్కెట్‌...

Published on: Wed Jan 19, 2022 11:24AM

తాగుడు, ఎగురుడు, తందానాలాడుడు. ఆర్జీవీ అంటే జ‌ల్సా రాయుడు. విలాస పురుషుడు. ఎనీటైమ్‌ ఓడ్కా మ‌త్తులో జోగేవాడు. అలాంటి వ‌ర్మ‌కు.. గుడివాడ‌లో క్యాసినో పెట్టార‌ని తెలిస్తే.. ఎంత‌ ఖుషీ అవుతారో చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఏపీ మంత్రి కొడాలి నానికి చెందిన‌.. కె క‌న్వెష‌న్‌లో క్యాసినోతో పాటు మందు, విందు, చిందు, పేకాట‌, గుండాల‌, చీర్ గర్ల్స్‌.. అబ్బో ఏది కావాలంటే అది.. గుడివాడ‌లో గోవాను త‌ల‌పించే సెట‌ప్‌ అరేంజ్ చేశారని తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అంతా త‌ప్పుబ‌డుతుంటే.. వ‌ర్మ మాత్రం తెగ పొగిడేస్తున్నారు. గుడివాడ‌ను గోవా, లాస్ వెగాస్ స‌ర‌స‌న నిలిపారంటూ కొడాలి నానిపై ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. 

రాంగోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా కొడాలి నానిపై కామెంట్స్ చేశారు. "గుడివాడను లండన్, పారిస్, లాస్ వెగాస్‌ల సరసన నిలిపారు. గుడివాడ ప్రజలు గోవాకు వెళ్లిన ఫీలింగ్‌ను నాని కల్పించారు" అంటూ వ‌రుస‌ ట్వీట్స్‌ చేశారు వర్మ. ఇటీవ‌ల సినిమా టికెట్ల వ్య‌వ‌హారంలో కొడాలి నాని ఎవ‌రో త‌న‌కు తెలీదంటూ హాట్ కామెంట్స్ చేసిన వ‌ర్మ‌.. ఇప్పుడు కొడాలిని పొగుడుతూ ట్వీట్స్ చేసి.. ఆ డ్యామేజీని ఇలా క‌వ‌ర్ చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అంటున్నారు. వ‌ర్మనా మ‌జాకా... దొందు దొందే....