TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

స‌ర్కారుకు చ‌లిజ్వ‌రం.. జ‌గ‌న‌న్న‌పై వ‌ర్మ‌ సెటైర్లు..

Published on: Fri Feb 4, 2022 9:38AM

ఆర్జీవీ మ‌ళ్లీ గిల్లాడు. త‌న అభిమాన సీఎం జ‌గ‌న్‌రెడ్డిపై సెటైర్లు వేశాడు. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ చ‌లో విజ‌య‌వాడ‌తో ఇప్ప‌టికే దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాంక్ అయిన జ‌గ‌న్ స‌ర్కారుకు.. మ‌రింత నిద్ర క‌రువ‌య్యేలా కుళ్ల‌బొడిచాడు వ‌ర్మ‌. 

‘‘సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ఇన్ని లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలపడం నాకు షాకిస్తోంది. ఇలా ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా? అని నా సందేహం. A P సర్కార్ సంగతేమో గానీ విజయవాడలో జన సందోహాన్ని చూసి నాకు భయంతో చలి జ్వరం వచ్చేసింది’’ అంటూ ట్వీట్ చేశాడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. ‘చలో విజయవాడ’కు సంబంధించిన ఫొటోను సైతం పోస్ట్ చేశాడు. 

ఆర్‌జీవీ ట్వీట్‌పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ‘చలి జ్వరం అంటున్నావు.. కరోనా ఏమో టెస్ట్ చేయించుకో’.., ‘దీనిపై కూడా సినిమా ఏమైనా తీస్తావా?’ అని కొందరు, మీకు కష్టం వస్తే మాట్లాడడానికి చిరంజీవి ఉన్నాడు.. వాళ్లకి ఎవరూ లేరు.. అందుకే రోడ్డుపైకి వచ్చారు’ అని మరికొందరు కామెంట్స్ చేశారు. ఇంకొందరైతే.. ‘‘ఒక చేతిలో మందు.. మరో చేతిలో అమ్మాయి ఉన్న నీకు మా బాధలు ఏం తెలుస్తాయి కానీ.. నీ సెటైర్లు ఆపు..’’ అంటూ కాస్త ఘాటుగా కూడా వర్మకు బదులిచ్చారు.

మొద‌ట్లో జ‌గ‌న‌న్న‌కు, వైసీపీకి హార్డ్‌కోర్ ఫ్యాన్‌గా ఉన్న ఆర్జీవీ.. ఇటీవ‌ల సినిమా టికెట్ల ధ‌ర‌లు త‌గ్గింపుపై స‌ర్కారుకు రివ‌ర్స్ అయ్యాడు. త‌న‌దైన లాజిక్ పాయింట్స్‌తో మంత్రి పేర్ని నానిని, వైసీపీ ప్ర‌భుత్వాన్ని కుమ్మేశాడు. నానితో చ‌ర్చ‌లు కూడా జ‌రిపాడు. ఆ త‌ర్వాత సైలెంట్ అయిపోయాడు. వ‌ర్మ డీల్ చేసినా.. టికెట్ రేట్ల‌పై ప్ర‌భుత్వంలో స్పంద‌న లేక‌పోయేస‌రికా.. బాగా ఫీల్ అయిన‌ట్టున్నాడు. నేను చెప్పినా విన‌రా అనుకున్నాడో ఏమో.. ఇక వైసీపీ ప‌ని ప‌ట్టే ప‌నిలో బిజీ అయ్యాడు. గుడివాడ కేసినోపై కొడాలి నానిపై కామెంట్లు.. ఇప్పుడు ఉద్యోగుల చ‌లో విజ‌య‌వాడ‌పై జ‌గ‌న‌న్న‌కు చ‌లిజ్వ‌రం వ‌చ్చిన‌ట్టుంద‌నే అర్థం వ‌చ్చేలా ప‌రోక్ష వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి.