ఎన్టీఆర్ నన్ను ప్రశంసిస్తున్నారు...

 

వామ్మో వర్మకు ఉన్న క్రియోటివిటీ రోజు రోజుకి మరీ ఎక్కువైపోతుంది. తాను తీస్తున్న "లక్ష్మీస్ ఎన్టీఆర్" సినిమాపై ఇప్పటికే కావాల్సినంత హైప్ వచ్చేసింది. వర్మ ఎప్పుడైతే "లక్ష్మీస్ ఎన్టీఆర్" సినిమా తీస్తున్నానని చెప్పారో..టీడీపీ నేతలు వర్మపై విమర్శలు గుప్పించారో.. అప్పటి నుండి వర్మ మరీ రెచ్చిపోతున్నాడు. వాళ్లు చేసిన కౌంటర్లకు ఎన్ కౌంటర్లు ఇస్తూ పెద్ద దుమారమే రేపాడు. సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి, అనిత వంటి టీడీపీ నేత‌ల‌తో పాటు… అల‌నాటి హీరోయిన్ వాణీ విశ్వ‌నాథ్ చేసిన విమ‌ర్శ‌ల‌కు ఫేస్ బుక్ లోనే స‌మాధాన‌మిచ్చారు. అయితే ఈ తతంగా అంతా చూసిన  చంద్ర‌బాబునాయుడు ఈ సినిమా గురించి ఎవరూ ఏం మాట్లాడొద్దని సూచించారు. దీంతో ఈ వ్యవహారం కాస్త సద్దుమణిగింది అనుకుంటే వర్మ కావాలని మళ్లీ కెలుకుతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా త‌న ఫేస్ బుక్ ఖాతాలో వ‌ర్మ ఓ ఫొటోను అప్ లోడ్ చేశారు. ఓ కార్య‌క్ర‌మంలో వ‌ర్మ‌కు ఎన్టీఆర్ షేక్ హ్యాండ్ ఇస్తున్న ఫొటో ఇది. ఈ ఫొటోలోనే ఇంకో చిన్న ఫొటో కూడా ఉంది. ఎన్టీఆర్ ల‌క్ష్మీపార్వ‌తి దండ‌లు మార్చుకుంటుండ‌గా… చంద్ర‌బాబు వారి వెన‌క నిల్చుని ఉన్నారు. తాను, ఎన్టీఆర్ క‌లిసి ఉన్న ఫొటోకు వ‌ర్మ త‌న‌పై సినిమా తీస్తున్నందుకు న‌న్ను ప్రశంసిస్తున్నారని క్యాప్ష‌న్ పెట్టారు. మొత్తానికి వర్మ కావాలని రెచ్చగొడుతున్నట్టు చేస్తున్న ఈ వ్యాఖ్యలకు టీడీపీ నేతలు స్పందిస్తారో..? లేదో..? చూద్దాం..