8 నిమిషాల పాట కోసం కోటిన్నర ఖర్చు
Published on: Wed Apr 3, 2013 10:09AM

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించే ‘రేయ్’ సినిమా క్లైమాక్స్ పాట కోసం ఏకంగా రూ. కోటిన్నర ఖర్చు పెడుతున్నారట. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్ లో ఈ పాటను 20 రోజుల పాటు చిత్రీకరించనున్నారు.చిత్ర దర్శక, నిర్మాత వైవిఎస్ చౌదరి అమెరికాలో చూసిన ఓ లైవ్ షోతో ప్రభావితుడై ఇలా క్లైమాక్స్ ప్లాన్ చేశాడట. ఈ పాటకోసం సంగీత దర్శకుడు చక్రి, పాట రచయిత చంద్రబోస్ ఎంతో కష్టపడ్డారని ఆయన చెబుతున్నారు. చక్రి, భార్గవి పిళ్లై ఎంతో కష్టపడి ఈ పాటను పాడితే నృత్య దర్శకుడు ప్రేమ రక్షిత్ దీనిని చూసి ఎంతో ఉద్వేగానికి లోనై పలు సినిమాల అవకాశాలు వదులుకుని మరీ దీనికి డ్యాన్స్ కంపోజింగ్ చేశాడట. మొత్తం ఎనిమిది నిమిషాల పాటు ఈ పాట ఉంటుంది.


