TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రెవెన్యూశాఖను వీడని అవినీతి

Published on: Sat Jul 7, 2012 10:52AM

రెవెన్యూశాఖను అవినీతి వీడటం లేదు. దీనిపై ఎసిబి దృష్టి పెట్టినా ఏదో ఒకచోట ఈ అవినీతి జాడలు కనిపిస్తూనే ఉన్నాయి. అందుకే ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా నెలకు కనీసం రెండు మూడు కేసులు నమోదవుతున్నాయి. ఇలా సంవత్సరానికి కనీసం 36 కేసులు రెవెన్యూశాఖకు సంబంధించే ఎసిబి నమోదు చేస్తోంది. ఎంఆర్‌ఓ స్థాయి నుంచి రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌, విఆర్‌ఓ వరకూ అవినీతి వాటాదారులవుతున్నారు.

 

 

తాజాగా కరీంనగర్‌ జిల్లా రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ తిరుపతి గ్యాస్‌ ఏజెన్సీని పదివేల రూపాయలు ఇస్తేనే పని చేస్తానని డిమాండు చేశారు. దీంతో గ్యాస్‌ ఏజెన్సీ అథిపతి, మేనేజర్‌ ఎసిబిని ఆశ్రయించారు. ఎసిబి దీనిపై ఆథారాలు సేకరించింది. పూర్తి ఆథారాలతో ఆ ఆర్‌ఐ తిరుపతిని వలపన్ని పట్టుకుంది. ఇలానే   కర్నూలు, తూర్పుగోదావరి, ఖమ్మం తదితర జిల్లాల్లో రెవెన్యూశాఖ సిబ్బంది కూడా  ఎసిబి పలుమార్లు వలపన్ని పట్టుకుంది.