TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టాలీవుడ్ ఒత్తిడికి తలొగ్గిన రేవంత్ సర్కార్!

Published on: Thu Jan 9, 2025 11:27AM

టాలీవుడ్ ఒత్తిడికి రేవంత్ సర్కార్ తలొగ్గింది. తాను అధికారంలో ఉన్నంత వరకూ కొత్త సినిమాల విడుదల సందర్భంగా బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపు ప్రశక్తే ఉండదన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనక్కు తగ్గారు. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపునకు అనుమతి ఇచ్చేదే లేదని అసెంబ్లీ వేదికగా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆ మాట మీద నిలబడటంలో విఫలమయ్యారు.

శుక్రవారం (జనవరి 10)న విడుదల కానున్న గేమ్ ఛేంజర్ సినిమాకు అదనపు షోలు, టికెట్ల ధరల పెంపునకు ఓకే అన్నారు.  గేమ్ ఛేంజర్ సినిమా అదనపు షోలు,  టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇస్తూ రేవంత్ సర్కార్  బుధవారం (జనవరి 8) రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.  సినిమా విడుదల అయిన రోజు ఏకంగా ఆరు షో లు...అదనపు రేట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విడుదల తరువాత రోజు నుంచీ అంటే శనివారం (జనవరి 11) నుంచి  తొమ్మిది రోజుల పాటు రోజుకు ఐదు షో లకు అనుమతి ఇచ్చింది.  సినిమా రిలీజ్ రోజున మల్టీప్లెక్స్ ల్లో 150 రూపాయలు, సింగల్ స్క్రీన్స్ లో 100 రూపాయల మేర అదనపు రేట్లకు ఆమోదం తెలిపింది.  మిగిలిన తొమ్మిది రోజుల్లో మల్టీప్లెక్స్ ల్లో వంద రూపాయలు, సింగల్ స్క్రీన్స్ లో ఏభై రూపాయల మేర టికెట్ల ధర పెంచుకునేందుకు ఓకే చెప్పింది.