తెలంగాణ సీఎం రేవంత్ అమెరికా పర్యటనకు కేంద్రం నో పర్మిషన్.!
Published on: Fri Aug 21, 2026 11:29AM

తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చేపట్టిన విదేశీ పర్యటన చివరి నిముషంలో రద్దైంది. . బ్రిటన్ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్న అనంతరం ఆయన నేరుగా అమెరికా చేరుకోవాల్సి ఉంది. అయితే కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి అనుమతులు లభించకపోవడంతో, అమెరికా ఆయన తన అమెరికా టూర్ క్యాన్సిల్ చేసుకుని లండన్ నుంచే స్వరాష్ట్రానికి తిరుగుపయనం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తెలంగాణ రైజింగ్ అనే ప్రత్యేక బ్రాండ్ పేరుతో సీఎం బృందం ఈ విదేశీ పర్యటనలను రూపొం దించింది. ఇందులో భాగంగా లండన్ తో పాటు అమెరికాలోని ప్రముఖ నగరాలైన బోస్టన్, న్యూయార్క్ ప్రాంతాల్లో పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఖరారు చేసింది.
అయితే ఈ పర్యటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి లభించిన అనుమతులలో స్పష్టత లోపించింది. బ్రిటన్ వేదికగా జరిగే అధికారిక కార్యక్రమాలకు మాత్రమే విదేశాంగ శాఖ ఆమోదం తెలిపింది. కానీ అమెరికాలో నిర్వహించతలపెట్టిన సమావేశాలకు అనుమతి ఇవ్వలేదు. కేంద్రం నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో, రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో రేవంత్ ఈనెల 23న లండన్ నుండి నేరుగా హైదరాబాద్ చేరుకోనున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ చివరి క్షణంలో ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలేమిటన్నది తెలియాల్సి ఉంది.
Revanth Reddy US Tour Cancelled, Telangana Rising Summit, Ministry of External Affairs clearance, CM Revanth Reddy UK Visit, Telangana Investments News Telugu


