టీఆర్ఎస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్.. రైతులను దగా చేస్తున్నాయని రేవంత్ ఫైర్
Published on: Wed Nov 24, 2021 11:32AM
తెలంగాణ రాష్ట్ర సమాజానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కల్లాలలో రైతు కన్నీరు పెడుతుంటే.. ఢిల్లీలో తెలంగాణ సిఎం కేసీఆర్ సేద తీరుతున్నాడని ఆరోపించారు. తెలంగాణ సిఎం కేసీఆర్ డిల్లీ పర్యటన.. టిఆర్ఎస్, బిజేపి రెండు పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగమేనని సంచలన ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి.ఈ తీర్థ యంత్రాల తో రైతాంగానికి తెలంగాణ రాష్ట్రానికి కు అయ్యేది, పొయ్యేది ఏమి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వానాకాలం పంట కొనకుండా యాసంగి పంట గురించి ఇప్పుడు పంచాయతీ ఏంది.. ? అని బహిరంగ లేఖలో నిలదీశారు రేవంత్ రెడ్డి. టిఆర్ఎస్, బీజేపీ రాజకీయా చదరంగంలో రైతు పావుగా మారారని చెప్పారు. రైతాంగానికి అండగా నిన్న, నేడు, రేపు కాంగ్రెస్ పార్టీ ఉంటుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ రైతులు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు.


