రేవంత్ రెడ్డిలో కొత్త కోణం- కర్రసాముతో హల్ చల్

posted on: May 18, 2022 11:21AM

రాజకీయ ప్రత్యర్థులపై బస్తీమే సవాల్ అంటూ విమర్శలతో చెలరేగిపోయే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, అవసరమైతే గోదాలో నిలబడి కర్రసాముతో భౌతికంగా కూడా ఎదురొడ్డి నిలబడగలనని చెప్పకనే చెబుతున్నారు.

తన అన్న కుమారుడి వివాహ వేడుకలో రేవంత్ తనలోని ఈ కొత్త కోణాన్ని చూపించారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా క్షణం తీరిక లేకుండా రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉండే రేవంత్ రెడ్డి కల్వకుర్తిలో జరిగిన తన అన్న కుమారుడి వివాహానికి హాజరై బంధు మిత్రులతో ఉల్లాసంగా గడిపారు.

ఆ సందర్భంగానే తనలో దాగున్న, ఇప్పటి వరకూ ఎవరికీ తెలియని కొత్త కోణాన్ని చూపారు. వివాహ వేడుకలో కర్ర చేతపట్టి సాము చేసి అందరి చేతా ఔరా అనిపించుకున్నారు. ఆయన కర్రసాము చేస్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి.

చేయితిరిగిన వస్తాదులా ఆయన కర్రసాము చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నాయి. మాటలే కాదు చేతల్లోనూ రేవంత్ తో పెట్టుకోవాలంటే రాజకీయ ప్రత్యర్థులు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...