కేసీఆర్ చుట్టూ బీహారీ కోటరీ!.. పరాయి పాలనంటూ రేవంత్‌రెడ్డి మండిపాటు..
Published on: Thu Mar 3, 2022 3:30PM
తెలంగాణలో ఐఎఎస్, ఐపీఎస్‌ల పోస్టింగ్‌లపై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. కీలకమైన శాఖలు బీహార్ అధికారుల చేతంల్లోనే ఉన్నాయన్నారు. కేసీఆర్ చుట్టు ఉన్న వాళ్లు, అధికారులు బీహారిలేనని.. ఉద్యమంలో కీలకంగా పనిచేసిన అధికారులు నిరాదరణకు గురవుతున్నారని గుర్తు చేశారు.
రాష్ట్రంలో 157 ఐఏఎస్, 139మంది ఐపీఎస్‌లు ఉండగా బీహార్ అధికారులను అందలం ఎక్కించడం వెనక ఆంతర్యం ఏమిటిని ప్రశ్నించారు రేవంత్‌రెడ్డి. డీజీపీ పదవులు కూడా బీహారి అధికారులకే ఇచ్చారు.. బీహార్ అధికారులకు పదుల సంఖ్యలో శాఖలు కేటాయించారని తప్పుబట్టారు.
హెచ్ఎండీఏ, రేరా.. సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్ ఇచ్చిన అనుమతులపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జయేశ్ రంజన్ సారధ్యంలో టీఎస్‌ఐఐసీ ద్వారా జరిగిన భూ కేటాయింపులపై విచారణ జరిపించాలని కోరారు.
ప్రత్యేక రాష్ట్రం వస్తే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని, మేథావి వర్గం పరిపాలనలో భాగస్వామి అవుతుందని ఆశించామని.. కానీ, ఎనిమిదేళ్లుగా ఇంకా పరాయి పాలనలోనే మగ్గుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి.





