TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ద‌టీజ్ రేవంత్‌రెడ్డి.. జ‌గ్గారెడ్డికి చెక్‌.. వీహెచ్‌కు ఝ‌ల‌క్‌.. నెక్ట్స్ కోమ‌టిరెడ్డి?

Published on: Tue Mar 22, 2022 12:04PM

స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యం. నాయ‌కుడి ఉత్త‌మ ల‌క్ష‌ణం. రేవంత్‌రెడ్డి తనెంత స్ట్రాంగ్ లీడ‌రో మ‌రోసారి నిరూపించుకున్నారు. ఇన్నాళ్లూ అధికార పార్టీపై దూకుడుగా ఉంటున్నా.. సొంత‌పార్టీ విష‌యంలో కాస్త సంయ‌మ‌నం పాటిస్తూ వ‌చ్చారు. సో కాల్డ్ సీనియ‌ర్లు త‌న‌పై ఎంత‌గా రెచ్చిపోతున్నా.. ఎక్క‌డ త‌గ్గాలో అక్క‌డ త‌గ్గుతూ వ‌చ్చారు. ఇప్పుడిక నెగ్గే స‌మ‌యం వ‌చ్చింది. నెగ్గి చూపించారు. పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి తోక క‌ట్ చేశారు. ఇక కాంగ్రెస్‌లో నిత్య అసంతృప్తవాది అయిన వీహెచ్‌కు మ‌ళ్లీ నోరెత్త‌కుండా ఝ‌ల‌క్ ఇచ్చారు. మిగ‌తా సీనియ‌ర్ల‌కు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చారు. ఒక్క దెబ్బ‌కు రెండు పిట్ట‌ల‌తో.. రేవంత్‌.. ది లీడ‌ర్‌..గా ప్రూవ్ చేసుకున్నారు. 

జ‌గ్గారెడ్డి కాంగ్రెస్‌లోనే ఉన్నా.. ఆయ‌నను ఏకాకి చేయ‌డంలో రేవంత్‌రెడ్డి స‌క్సెస్ అయ్యారు. మొద‌టి నుంచీ త‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తూ వ‌స్తూ.. ప‌దే ప‌దే త‌న‌ను కార్న‌ర్ చేస్తూ వ‌చ్చిన జ‌గ్గారెడ్డిపై అదునుచూసి యాక్ష‌న్‌లోకి దిగిపోయారు. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మిన‌హా, మిగ‌తా అద‌న‌పు బాధ్య‌త‌ల‌న్నిటి నుంచీ జ‌గ్గారెడ్డిని తొల‌గించారు. పార్టీలో ఉంటే ఉండు.. పోతే పో.. అనే మెసేజ్ ఇచ్చారు. ఈ ప‌ని ఇంత‌కు ముందే చేయొచ్చు. కానీ, ఓ కుక్క‌ను చంపాలంటే ముందు దానిపై పిచ్చిది అనే ముద్ర వేయాల‌న్న‌ట్టు.. త‌న‌కు వ్య‌తిరేకంగా జ‌గ్గారెడ్డి, వీహెచ్‌, మ‌ర్రి శ‌శిధ‌ర్‌రెడ్డిలు మీటింగ్ పెట్టుకోవ‌డం.. వీహెచ్ మంత్రి హ‌రీశ్‌రావుతో భేటీ జ‌ర‌ప‌డం.. ఇలా ప‌క్కాగా ఇరుక్కున్నాకే.. వేటు వేశారు రేవంత్‌రెడ్డి. అంతే. రేవంత్ నిర్ణ‌యంపై ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక్క కామెంట్ కూడా వినిపించ‌లేదు. అంతా గ‌ప్‌చుప్‌. జ‌గ్గారెడ్డి, వీహెచ్ సైతం డిఫెన్స్‌లో ప‌డిపోయారు. ఇదీ.. స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యం అంటే. 

జ‌గ్గారెడ్డికి ఒక్క సంగారెడ్డిలో మిన‌హా మ‌రెక్క‌డా బ‌లం లేదు. ఆయ‌న‌కు కాంగ్రెస్‌లో మ‌రెవ‌రి నుంచీ అంత‌గా మ‌ద్ద‌తు లేదు. ఆయ‌న సింగిల్‌. కానీ, రేవంత్ పీసీసీ చీఫ్ అయిన‌ప్ప‌టి నుంచీ ఆయ‌నపై ఏదో ఒక విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నారు. ఇన్నాళ్లూ భ‌రించారు. ఇప్పుడు స‌మ‌యం వ‌చ్చింది. ప‌నిష్ చేశారు. జ‌గ్గారెడ్డి కామూష్‌. వీహెచ్ షాక్‌. ప‌రుగున ఢిల్లీ వెళ్లి, అధిష్టానానికి వివ‌ర‌ణ ఇచ్చుకునే పనిలో ఉన్నారు వి.హ‌న్మంత‌రావు. వ‌న్ షాట్ టూ బ‌ర్డ్స్ అంటే ఇదే. ఈ దెబ్బ‌కు మిగ‌తా సీనియ‌ర్లు అంతా దారికొచ్చిన‌ట్టే. ఒక్క కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ మిన‌హా. 

అవును, కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ మొద‌టి నుంచీ రేవంత్‌రెడ్డిపై గుర్రుగానే ఉన్నారు. ఉమ్మ‌డి న‌ల్గొండ‌ జిల్లా వ్యాప్తంగా బ‌ల‌మైన నాయ‌కులు కావ‌డంతో వారి విష‌యంలో కాస్త సంయ‌మ‌నం పాటిస్తున్న‌ట్టున్నారు రేవంత్‌రెడ్డి. ఇప్ప‌టికే తాను త‌గ్గి.. వెంక‌ట్‌రెడ్డిని ఇంటికెళ్లి మ‌రీ క‌లిసొచ్చారు. క‌లిసి ప‌ని చేద్దామ‌ని ఓ ఛాన్స్ ఇచ్చారు. వింటే స‌రేస‌రి. లేదంటే, జ‌గ్గారెడ్డి త‌ర‌హాలోనే కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌కు కూడా టైమ్ వ‌చ్చిన‌ప్పుడు చెక్ పెట్ట‌డం ఖాయం అంటున్నారు. అయితే, వారే కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరే ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. పార్టీని వీడితే ఓకే.. అదే కాంగ్రెస్‌లో ఉండాలంటే మాత్రం రేవంత్‌రెడ్డి లైన్లోనే ఉండాల‌నేది జ‌గ్గారెడ్డి ఎపిసోడ్‌తో కాంగ్రెస్ శ్రేణులంద‌రికీ స్ట్రాంగ్ మెసేజ్ వెళ్లిపోయింద‌ని అంటున్నారు. ఒక్క యాక్ష‌న్‌తో.. ఎన్ని వార్నింగులో.. రేవంత్‌రెడ్డినా.. మ‌జాకా..!