TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

షర్మిల పార్టీపై రేవంత్‌రెడ్డి బ్యాడ్ ఎఫెక్ట్‌.. ఆవిర్భావంకు ముందే ఆగ‌మాగం..

Published on: Sat Jul 3, 2021 6:23PM

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లే ఉంది తెలంగాణలో రాజకీయ వ్యవహారం. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ ఇవ్వకూడదని ఎంతమంది ఎంతమందికి మొక్కుకున్నారో తెలియదు కాని.. ఇప్పుడు వారికి అంతకంటే ఘోరమైన పరిస్ధితి వస్తోంది. ఏపీలో అన్న రాజ్యమేలుతుంటే..తనకు స్కోప్ లేదని అడిగితే... కొత్త స్ధలం ఇచ్చి ఇల్లు కట్టుకోమని చెప్పినట్లే.. మేడమ్ కు తెలంగాణ చూపించారు. సరే ఇక్కడ రాజకీయం చేస్తూ.. ఏదో విధంగా రాజ్యమేలాలని వచ్చిన షర్మిలక్కకు రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడం నచ్చలేదు. అందుకే టీడీపీ నుంచి వచ్చినవారికే కాంగ్రెస్ చీఫ్ పదవి ఇచ్చారంటూ విమర్శించింది కూడా. 

రేవంత్ రెడ్డికి ఇవ్వరని మొన్నటివరకు అనుకుని.. వ్యూహాలు రూపొందించారు. రెడ్డి సామాజికవర్గాన్ని, గతంలో ఇప్పుడు కాంగ్రెస్ ను నమ్ముకున్నవారిని...గతంలో వైఎస్ఆర్ తో అనుబంధం ఉన్నవారిని లిస్ట్ అవుట్ చేసుకుని..వారందరినీ తమ కొత్త పార్టీలో చేర్చుకుని రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ను దారుణంగా దెబ్బ తీయాలనేది షర్మిల ప్లాన్ గా కనపడుతోంది. అలా అయితే గాని..తనకు సోర్స్ వేరే ఏమీ ఉండదనేదే దాని వెనక ఆలోచన. ఈ ప్లాన్ ఎవరికి మేలు చేస్తుందో మనం వేరే చెప్పుకోనక్కర్లేదు. కాని ఇప్పుడు ఆ ప్లాన్స్ అన్నీ డామిట్ అంటూ వెనక్కు పోతున్నాయి. రేవంత్ కు పదవి రావడంతోనే..కాలిక్యులేషన్స్, ఈక్వేషన్స్ మారిపోయాయి.

పొన్నాల లక్ష్మయ్య లాంటి సీనియర్ నేతలు వైఎస్ టైమ్ లో వెలుగు వెలిగినవారే. అలాంటి నేతలతో షర్మిల పార్టీ సంప్రదింపులు జరిపింది. వారు వస్తున్నట్లు లీకులు కూడా ఇచ్చింది. కాని  పొన్నాల మాత్రం తెలివిగా టైమ్ తీసుకున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి వంటి వారిని కూడా కాంటాక్ట్ చేశారు. ఆయన డైరెక్టుగా చెప్పేశారు.. షర్మిల పార్టీ ఆల్టరనేటివ్ కాలేదని.. అందులో చేరే ప్రసక్తే లేదని కూడా తేల్చేశారు. కోదండరామ్ వంటి వారిని కూడా పార్టీలోకి తెచ్చుకుంటున్నట్లు షర్మిల పార్టీ ప్రచారం చేసుకుంది..అవన్నీ ఇప్పుడు బెలూన్ లా తేలిపోయాయి.

రెడ్డి సామాజికవర్గంలో కేసీఆర్ ని వ్యతిరేకించేవారంతా రేవంత్ కే మద్దతు ఇవ్వాలని డిసైడ్ చేసేసుకున్నట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ తో అనుబంధం ఉన్న కొండా సురేఖ వంటివారు సైతం రేవంత్ రెడ్డితో జత కడుతున్నారు. ఇప్పుడు ఇప్పటికే షర్మిల పార్టీలో ఇన్వాల్వ్ అయిన నేతలు సైతం పునరాలోచనలో పడినట్లు సమాచారం. ఇందిరాశోభన్ వంటివారు సైతం రేవంత్ రెడ్డి రావడంతో మళ్లీ కాంగ్రెస్ కు వెళ్లే ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
 
దీంతో ఇప్పుడు షర్మిల ఆలోచనలో పడినట్లు చెప్పుకుంటున్నారు. లేటెస్టుగా ప్రశాంత్ కిషోర్ శిష్యురాలు..తమిళనాడుకు చెందిన మీడియా అధినేత షర్మిలకు వ్యూహకర్తగా మాట్లాడుకున్నట్లు అధికారికంగానే సమాచారం వచ్చింది. పార్టీ ఆవిర్బావానికి ముహూర్తాలు పెట్టుకుని..ఆ ముహుర్తానికి ముందే హడావుడి చేసిన షర్మిల..ఇప్పుడు ఆ ముహూర్తం దగ్గరపడుతున్న కొద్దీ ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అవుతున్నట్లు కనపడుతోంది. మరి వీటిని అధిగమించి ముందుకు ఎలా వెళుతుందనేది వేచి చూడాలి.