రేవంత్ కూడా అందరిలాంటివాడేనా...!

 

వెనుకటి రోజుల్లో రాజ్యాలను కాపాడుకోవటాని,అంతర్గత తిరుగుబాట్లను ఎదుర్కొటానికి రాజులూ, మంత్రులు చేసిన మంత్రాంగమే రాజకీయం. ఈ రోజుల్లో అధికార పీఠం మీద కూర్చోడానికి కొన్ని సమూహాలు(పార్టీలు ) చేస్తున్న కుతంత్రమే రాజకీయం. అప్పుడైనా ఇప్పుడైనా రాజకీయం యెక్క అంతిమ లక్ష్యం ఒక్కటే అధికారం. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్ అవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నారు మన రాజకీయ నేతలు. ఈ మధ్య కాలంలో ఈ సంప్రదాయం మరీ ఎక్కువై పోయింది. తెలుగు రాష్ట్రాల విషయానికే వస్తే ప్రస్తుతం ఏపీలో ఉన్న అధికార పార్టీలోకి ప్రతిపక్ష పార్టీ నేతలు ఎంతో మంది చేరారు. ఇంకా చేరడానికి సిద్దంగా కూడా ఉన్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లోకి వెళుతున్నారు. రాజకీయం అంటేనే ఇది... ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటాయో ఎవరూ చెప్పలేరు. రేవంత్ రెడ్డిని చూస్తుంటే ఇప్పుడు అదే అనిపిస్తుంది. టీడీపీలో మంచి వాక్చాతుర్యం ఉన్న నాయకుల్లో రేవంత్ రెడ్డి ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు. కేసీఆర్ అంతటి వాడే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతాడో అని భయపడతాడు.  టీ టీడీపీ తరపున టీఆర్ఎస్ పై యుద్ధం చేసే ఏకైన వ్యక్తి.. మరి అలాంటి రేవంత్ రెడ్డికి ఏమైంది.

 

తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలపై స్పందించినా.. అయినా కాంగ్రెస్ తో కలిస్తే తప్పేంటి అని ప్రశ్నించి అందరికి షాకిచ్చాడు. ఇక నిన్న జరిగిన టీటీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో రేవంత్ సమాధానాలు చూస్తుంటే.. కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమనే అనుమానాలు కూడా వస్తాయి. పార్టీ మార్పుపై... రాహుల్ గాంధీని కలిశారా..? అంటూ ఇలా పలు ప్రశ్నలు అడడగా దానికి ఆయన నాకు ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని అనడం.. ఏది ఉన్నా చంద్రబాబు నాయుడితో మాట్లాడతా అనడం ఇవన్నీ రేవంత్ రెడ్డి పార్టీ మార్పుపై సందేహాన్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో వార్త బయటకు వచ్చింది. తాను కాంగ్రెస్ లో రావడానికి సిద్ధమే అని… తనకు టి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు తన వర్గానికి చెందిన నాయకులకు మొత్తం కలుపుకుని 35 టికెట్లు ఇవ్వాలని ఆయన కాంగ్రెస్ హైకమాండ్ ముందుకు కండీషన్ పెట్టారట. ఇక కాంగ్రెస్ కూడా రేవంత్ రెడ్డి డిమాండ్లను ఒప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఎంత మంది ఎన్ని ఆఫర్లు ఇచ్చినా రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీని వీడిచిపెట్టరన్న గట్టి నమ్మకం టీడీపీ నాయకుల్లో ఉండేది. కానీ అందరిలాగ రేవంత్ రెడ్డి కూడా అధికారం కోసం పార్టీ మారుతూ.. తానూ కూడా అందరిలాంటి నాయకుడే అని రుజువు చేశాడు అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఫైనల్ గా ఏం జరుగుతుందో చూద్దాం...