నాంపల్లి క్రిమినల్ కోర్టుకు రేవంత్ రెడ్డి..

Publish Date:Jan 10, 2017


టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నాంపల్లి క్రిమినల్ కోర్టుకు హాజరయ్యారు.  హైటెక్ సిటీ వద్ద భూముల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని... ఈ కేటాయింపుల్లో మై హోం సంస్థ భారీగా లబ్ధి పొందిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో మై హోం అధినేత జూపల్లి రామేశ్వరరావు.. రేవంత్ రెడ్డిపై పరువునష్టం కేసు దాఖలు చేశారు.  రేవంత్ వ్యాఖ్యలతో తన పరువుకు భంగం కలిగిందని... పరువు నష్టం కింద రూ. 90 కోట్లు చెల్లించాలంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిలో భాగంగా రేవంత్ రెడ్డి ఈరోజు కోర్టుకు వచ్చారు. కేసును విచారించిన కోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేసింది.

By
en-us Politics News -