వైభవంగా రేవంత్‌రెడ్డి కుమార్తె వివాహం
Published on: Sun Dec 20, 2015 10:26PM

తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కుమార్తె నైమిశ వివాహం సత్యనారాయణరెడ్డితో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో వైభవంగా జరిగింది.ఈ వేడుకలో గవర్నర్ నరసింహన్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు ఈ వివాహ వేడుకలలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.


