Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేసీఆర్ ను తిట్లతో ఏకిపారేసిన రేవంత్
posted on: Jul 2, 2015 12:04PM
.jpg)
ఓటుకు నోటు కేసులో బెయిల్ మీద విడుదలైన రేవంత్ రెడ్డి కేసీఆర్ పై ఫుల్లు ఫైర్ మీద ఉన్నట్టు నిన్న ఆయన ప్రసంగం వింటేనే తెలుస్తోంది. ఆయన చేసిన ప్రసంగంలో సీఎం కేసీఆర్ తోపాటు కేటీఆర్ ను, హరీశ్ రావు, పార్టీ నేతలందర్ని కలిపి తిట్లతో ఏకిపారేశారు. తెలంగాణ ప్రజలను మోసం చేసి తన కుటుంబానికే పదవులు కట్టబెట్టి కుటుంబ పరిపాలన చేస్తున్న కేసీఆర్ ను ప్రశ్నించినందుకే ఈ కేసులో ఇరికించారని అన్నారు. "ఈ కేసులో నన్ను ఇరికించడం వల్ల ఇప్పుడున్న దానికంటే ఎక్కువ పేరొచ్చిందని.. కానీ కేసీఆర్ కు నేను బయటకు రావడం వల్ల జ్వరం వచ్చిందని" రేవంత్ ఎద్దేవ చేశారు. ఇకనుండి కేసీఆర్ ను గద్దె దించడం కోసమే పనిచేస్తానని.. కేసీఆర్ కు రాజకీయ జీవితం లేకుండా చేస్తానని అన్నారు. కేసీఆర్ కనుక తెలంగాణ ముద్దుబిడ్డ అయితే.. కేసీఆర్ లో ప్రవహించేది తెలంగాణ రక్తం అయితే ఇతర పార్టీలో నుంచి తమ పార్టీలోకి చేర్చుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ పోటీ చేయించమని.. వాళ్లు కనుక గెలిస్తే తన ముక్కును నేలకు రాసుకుంటానని మీసం మెలేస్తూ.. తొడ గొడుతూ మరీ సవాళ్లు మీద సవాళ్లు విసిరారు. కేసీఆర్ నే కాదు మేనల్లుడు హరీశ్ రావును పై కూడా తిట్ల వర్షం కురిపించారు. హరీశ్ రావుకు మెదడు మోకాళ్లలో ఉందని.. మామ చేసిన బ్రోకర్ దందాలు ఆయనకు తెలియవా? అని ప్రశ్నించారు.
తెలంగాణలో తెదేపాని దెబ్బతీయాలని ఈ రకంగా కుట్రలు చేశారని.. తెలంగాణలో టీడీపీ జెండాని టచ్ చేసే మగాడే లేడని ఉండే రండి చూసుకుందాం అని సవాల్ విసిరారు. తెలంగాణ టీడీపీలో పవర్ ఫుల్ లీడర్ రేవంత్ రెడ్డి. అలాంటి రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపన్ని ఈకేసులో ఇరికించారు. ఇప్పుడు బయటకు వచ్చిన రేవంత్ రెడ్డి ఊరికే ఉంటాడా.. అసలే ఎంతోకొంత రేవంత్ రెడ్డి అంటే అటు కేసీఆర్ కైనా ఇటు మిగతా నాయకులకైన కొంచెం భయమనే చెప్పుకోవాలి. ఎందుకంటే అసెంబ్లీ గట్టిగా మాట్లాడే వాక్చాతుర్యం ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి కాబట్టి. మొత్తానికి దెబ్బ తిన్న పులిలా ఉన్న రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ నేతలపై తన దెబ్బని చూపే వరకూ నిద్రపోయేలా లేరనిపిస్తుంది.





