TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేసీఆర్ పై హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలి.. రేవంత్

Published on: Sat Mar 18, 2023 10:42AM

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ రాక్షస పాలనకు మరో యువకుడు బలయ్యాడని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ  అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సిరిసిల్లకు చెందిన నవీన్ అనే యువకుడు గత కొంత కాలంగా గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. కాగా ఇటీవల TSPSC పేపర్ లీక్ కారణంగా పలు పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే.

అలాగే గ్రూప్-1 పరీక్షను రద్దు చేశారు. దీంతో మనస్థాపానికి గురైన నవీన్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడి ఆత్మహత్యకు తెలంగాణ ప్రభుత్వమే కారణమని రేవంత్ తన ఇన్స్టా లో  పేర్కొన్నారు. కేసీఆర్‌పై హత్యా నేరం కింద కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.

నవీన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువత ఆత్మస్థైర్యం కోల్పోవద్దని   కాంగ్రెస్ అండగా ఉంటుందని రేవంత్ భరోసా ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం చేద్దామని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.