TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చుండూరులో చ‌ర్చ‌కు సిద్ధ‌మా.. రాజ‌గోపాల్‌కు రేవంత్ స‌వాలు

Published on: Fri Aug 5, 2022 1:07PM

 ప్ర‌స్తుతం కాంగ్రెస్, బీజేపీల మ‌ధ్య మునుగోడు రాజేసిన చిచ్చు మ‌రింత ర‌స‌వ‌త్త‌రం అవుతోంది.  కాంగ్రెస్ సీనియ‌ర్ నేత రాజ‌గోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పంచ‌న చేరడంతో  కాంగ్రెస్‌లో ఆయ‌న ప‌ట్ల సీరియ‌స్‌గానే విమ‌ర్శ‌లు, చ‌ర్చ‌కు స‌వాళ్లు వచ్చాయి. ఇపుడు తాజాగా టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డితో ఎలాంటి చ‌ర్చ‌క‌యినా సిద్ధ‌మ‌ని స‌వాలు చేయ డం గ‌మ‌నార్హం. చుండూరు చౌరాస్తా వేదిక‌గా బ‌హిరంగ చ‌ర్చ‌కు తాను సిద్ధ‌మ‌ని, రాజ‌గోపాల్ రెడ్డి చ‌రిత్ర ను బ‌య‌ట‌పెట్ట‌గ‌ల‌న‌ని రేవంత్ స‌వాలు విసిరారు.

రాజ‌గోపాల్ రెడ్డి కేవ‌లం త‌న ఆర్ధిక ప్ర‌యోజ‌నాల‌ను ఆశించే కాంగ్రెస్‌ను వ‌దిలి బీజేపీలోకి వెళ్లార‌ని రేవంత్ మీడియాతో అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక‌ల ప్ర‌చారానికి పార్టీ సీనియ‌ర్ నేత కోమ‌టిరెడ్డి వెంక‌ట రెడ్డి సార‌ధ్యం వ‌హిస్తార‌ని తెలిపారు. రాజ‌గోపాల్ రెడ్డి మునుగోడు బీజేపీ అభ్య‌ర్ధిగా గెల‌వ‌డానికి అవ‌కాశాల గురించి మ‌రోవంక బీజేపీ సీనియ‌ర్లు సందిగ్ధంలో పడ్డారు.

కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌ప‌డిన‌ప్ప‌టికీ, ఆయ‌న వెంక‌ట‌రెడ్డి సోద‌రునిగా కాంగ్రెస్ వ్య‌తిరేకంగా పోటీకి నిలిస్తే ప్ర‌జ‌లు ఏమేర‌కు అంగీక‌రిస్తార‌న్నది బీజేపీ నాయ‌కుల మధ్య చర్చోపచర్చలు జరుగుతున్నాయి. మ‌రోవంక మునుగోడును కాంగ్రెస్‌తోపాటు ఇటు టీఆర్ ఎస్ కూడా  కీల‌కంగా తీసుకుంది. కోమ‌టిరెడ్డి సోద‌రు లు మ‌నుగోడుపై పట్టు   కోల్పోయే విధంగా టీఆర్ ఎస్ గ‌ట్టి అభ్య‌ర్ధితో కాంగ్రెస్‌కు షాక్ ఇవ్వాల‌ని  వ్యూహాత్మ‌కంగా  అడుగులు వేస్తోంది.  కాగా కాంగ్రెస్‌లో త‌లెత్తిన కోమ‌టిరెడ్డి సోద‌రుల స‌మ‌స్య మ‌రింత ఇబ్బందిక‌రంగా మారే అవ‌కాశాలున్నాయ‌న్నది విశ్లేష‌కుల మాట‌. ఏమ‌యిన‌ప్ప‌టికీ స‌వాలు, ప్ర‌తి స‌వాలు తో రేవంత్ రెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి మునుగోడుకు మరింత ప్రాధాన్యత తీసుకువచ్చారని పరిశీలకులు అంటున్నారు.