కొండా సురేఖ శాఖలు రేవంత్ రెడ్డి చేతికి.. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ మాటేంటి?
Published on: Fri Sep 4, 2026 11:55AM
.webp)
కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేసిన తరువాత రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమె నిర్వహిస్తున్న శాఖల బాధ్యత స్వయంగా తానే చెప్పట్టారు. ఈ మేరకు బర్త్ రఫ్ ముందు వరకూ కొండా సురేఖ ఇంత వరకూ నిర్వహించిన శాఖలను సీఎం రేవంత్ నిర్వహిస్తారంటూ జీవో విడుదలైంది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయ వర్గాలలో కొత్త చర్చకు దారి తీశాయి. ఇప్పుడిప్పుడే కేబినెట్ విస్తరణ ఉండదా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. నేడో రేపో రేవంత్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని నిన్నమొన్నటి వరకూ ఓ రేంజ్ లో ప్రచారం జరిగింది.
కొండా సురేఖ బర్త్ రఫ్ ను రేవంత్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో ముడి పెట్టి ఈ ప్రచారం జరిగింది. గత కొంత కాలంగా హైకమాండ్ ను కేబినెట్ విస్తరణ కోసం రేవంత్ కోరుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ వివాదం నెలకొనడం, సీఎం ఢిల్లీ పర్యటన ఇవన్నీ కలిసి ఇక కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఖాయమన్న ప్రచారం రాజకీయవర్గాలలో జోరుగా జరిగింది.

అయితే ఆ ప్రచారానికి చెక్ పెడుతూ.. రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా కొండా సురేఖ శాఖలు సీఎం రేవంత్ రెడ్డి చేతికి వెళ్లడంతో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ప్రచారానికి ప్రస్తుతానికి తెరపడినట్లేనని అంటున్నారు.
[Revanth Cabinet Reshuffle Postpone, Konda sureka Portpolios, CM Hands, Telangana politics, Telugu One]


