TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాహుల్ కు మద్దతుగా కొడంగల్ లో రేవంత్ భారీ ర్యాలీ.!

Published on: Wed Jul 22, 2026 1:24PM

కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత  రాహుల్ గాంధీకి మద్దతుగా తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  భారీ ర్యాలీ నిర్వహించారు. తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో జరిగిన ఈ ర్యాలీకి  నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో  కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు  గా తరలివచ్చారు.

ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో  ప్రసంగించిన రేవంత్ రెడ్డి..  దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ నిరంతరం పోరాటం చేస్తున్నారని కొనియాడారు. ఎంతటి ఒత్తిళ్లు వచ్చినా, ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రజల తరఫున నిలబడే ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ మాత్రమేనని చెప్పారు. 

ఢిల్లీ లో  కాంగ్రెస్ చేపట్టిన ప్రధాని నివాస ముట్టడి కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ, ఇతర నేతల అక్రమ అరెస్ట్​ను సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ పట్ల దురుసుగా వ్యవహరించి గాయపరచడాన్ని ఖండిచిన ఆయన రక్త గాయమైనా రాహుల్ గాంధీ వెనక్కు తగ్గకుండా పోరాట పటిమ చూపారని కొనియాడిన రేవంత్ రె్డి.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కులపై కేంద్రం   ప్రత్యక్ష దాడికి పాల్పడిందని విమర్శించారు.  కేంద్ర ప్రభుత్వం యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్నదని, వారి న్యాయమైన డిమాండ్లకు మద్దతుగా, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రాహుల్, ప్రియాంక, ఇతర నేతల అరెస్టు అప్రజాస్వామికమని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.  

Revanth  massive rally, support, Rahul, Kodangal, Condemn, Arrest, Lathicharge