కేబినెట్ ముందు తెలంగాణ నోట్

 

Resolution on Telangana statehood, Telangana state, congress, sonia gandhi, man mohan singh, shinde, dig vijay singh

 

 

 

తెలంగాణ నోట్ను కేంద్ర కేబినెట్ ముందు ఉంచారు. కేంద్ర కేబినెట్ భేటీ గురువారం సాయంత్రం 5-30 గంటలకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి 14 మంది మంత్రులు, 37 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు మంత్రులు హాజరయ్యారు. తెలంగాణకు చెందిన జైపాల్‌రెడ్డి, సీమాంధ్రకు చెందిన కావూరి సాంబశివరావు, పల్లం రాజులు హాజరయ్యారు. మరో మంత్రి కిశోర్ చంద్రదేవ్ మాతృ వియోగంతో సమావేశానికి గైర్హాజరయ్యారు.

 

 

అయితే కేబినెట్‌లో నోట్‌ను వ్యతిరేకిస్తామని కావూరి సాంబశివరావు తెలిపారు. మిగిలిన మంత్రుల అభిప్రాయాలు వింటామని అన్నారు.  ఈ నెల 9న ప్రధాని విదేశీ పర్యటను వెళ్లనున్నారు. ఈ లోపలే తెంగాణ అంశంపై మంత్రి మండలి ఆమోదం పొందే ప్రయత్నాలలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.