TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉపఎన్నికల్లో చిత్తుగా ఓడించాలి : టీటీడీపీ ఫోరం

Published on: Tue Dec 20, 2011 3:34PM

హైదరాబాద్‌ : స్వార్థం కోసం రాజీనామా చేసిన టీఆర్‌ఎస్‌ను వచ్చే ఉపఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని టీటీడీపీ ఫోరం పిలుపునిచ్చింది. కేసీఆర్‌, కోదండరాంలపై ప్రజలు, రైతులు తిరగబడే రోజులు దగ్గరపడ్డాయని పేర్కొంది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తెలంగాణ కోసం రాజీనామా చేయలేదని, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే రాజీనామా చేశారని  ఆరోపించింది. ఏఒక్క సమస్యపై కేసీఆర్‌ ఉద్యమించలేదన్నారు. అన్నింటా డబ్బులు దండుకున్నారని ఆరోపించారు. వారు ఎన్నికలను బహిష్కరించేందుకు సిద్ధంగా ఉంటే, తాము ఎన్నికలకు  దూరంగా ఉంటామని వారు తెలిపారు. తమ నేత బాబు యాత్రను అడ్డుకుంటే, తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. టీటీడీపీ ఈరోజు భేటీ అయింది.