రిపబ్లిక్ సర్వేలు...ఇంత కామెడీనా...!

 

ఇప్పటికీ ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే ఎక్కువ మెజార్టీ సీట్లు వైసీపీకి వస్తాయని చెప్పి జగన్ సీఎం కలను నిజం చేశారు. ఇంతకీ ఈ సర్వే చేసింది ఎవరో కూడా తెలియదు. సాధారణంగా ఇక్కడ పీకే జగన్ పార్టీ పరిస్థితి ఏంటీ.. ప్రజలకు పార్టీపైన ఎలాంటి అభిప్రాయం ఉంది అని ఎప్పటికి ఎప్పుడు సర్వేలు చేస్తూ చెబుతుంటారు. ఇక ఇప్పటివరకూ చేసిన సర్వేల్లో ఎప్పుడూ.. జగన్ కు పాజిటివ్ టాక్ మాత్రం రాలేదు. కానీ ఇక్కడ కాదు ఎక్కడో రిపబ్లిక్ టీవీ చేసిన సర్వేలో మాత్రం  ఏకంగా జగన్ ను సీఎం చేసేశారు. ఇప్పుడు తాజాగా తమిళనాడు రాజకీయాలపై కూడా సర్వేచేసి పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.

 

అర్నబ్ సొంతంగా పెట్టిన ఛానల్ రిపబ్లిక్ టీవి. ఆయనకు ఏమైందో మరి... ఉత్తరాది వదిలేసి దక్షిణాదిన సర్వేలు మొదలుపెట్టారు. ఏపీలో జగన్ కు ఎక్కువ స్థానాలు వస్తాయి అని చెప్పిన రిపబ్లికి టీవి.. ఇప్పుడు తమిళనాడులో కనుక ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే రజనికి తమిళనాట 23 లోక్ సభ స్థానాలు వస్తాయని తేల్చింది.  డీఎంకే 14 , అన్నాడీఎంకే రెండు చోట్ల గెలుస్తారట.  మొత్తం ఓట్లలో 33 శాతానికి పైగా రజనికి మద్దతు ఇస్తారని కూడా రిపబ్లిక్ , సి ఓటరు సర్వే లో వెల్లడి అయ్యింది. దీంతో ఒకపక్క రజనీ ఆభిమానులు ఆనంద పడుతున్నా.. రజని పార్టీ కూడా అనౌన్స్ చేయకముందే ఇప్పటికిపుడు ఎన్నికలు వస్తే ఆయన పార్టీ మెజారిటీ సీట్లలో గెలుస్తుందని చెప్పడాన్ని తమిళ నేతలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు రిపబ్లిక్ టీవీ మీద ఉన్న మోడీ అనుకూల ముద్ర కూడా ఈ సందేహాలకు ప్రధాన కారణం.

 

ఇదిలా ఉండగా ఇక్కడ లోకల్ ఛానళ్లు కూడా అంతలా పట్టింకోని విషయాన్ని.. ఎక్కడో ఉన్న రిపబ్లికి టీవి ఛానల్ అంత స్పెషల్ గా దక్షిణాది రాష్ట్రాలపై సర్వే చేయడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎలాగూ వచ్చే సంవత్సరం ఏపీ లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక తమిళనాడులో ఎన్నికలు అయిపోయినా.. ఆ తరువాత జయలలిత మరణించడం...ఆతరువాత రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడటం...ఎన్నో ట్విస్టులు తరువాత ప్రభుత్వం ఏర్పడటం జరిగింది. మళ్లీ అటూ ఇటూ ఏమైనా జరిగినా... మొదటికే మోసం వస్తుంది. అంతేకాదు కొద్ది రోజుల్లో మూడు దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మరి ఈ రాష్ట్రాల్లో కూడా రిపబ్లిక్ టీవి సర్వేలు నిర్వహిస్తుందేమో. ఎందుకంటే.. ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాదిన బీజేపీకి అంత సీన్ లేదన్న సంగతి వారికి కూడా తెలుసు. అందుకే.. ఇలాంటి సర్వేలు చేసి కాస్త హడావుడి చేస్తున్నారని.. ఈ సర్వేల వెనుక మోడీ హస్తం ఉందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. మరీ కామెడీ కాకపోతే ఏంటీ ఈ సర్వేలు...